చిత్రం : సూత్ర ధారులు (1989)
రచన : డా॥సి.నారాయుణరెడ్డి
సంగీతం : కె.వి.వుహదేవన్
గానం : ఎస్.పి.బాలు, శైలజ
నేడు రమ్యకృష్ణ బర్త్డే
పల్లవి :
లాలేలో లిల్లేలేలో
రామలాఓయిలాల అమ్మలాలో (2)
మ్మ్... మూడు బురుజుల కోట ముత్యాల తోట
ముంగిట్లో చిన్నారి బావకు మురిపాల తీట
మూడు బురుజుల కోట ముత్యాల తోట
సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట ॥
చరణం : 1
ఓ... ఇంతలేసి కళ్లున్న ఇంతి మనసు చేమంతా
ముద్దబంతా చెప్పరాదా చిగురంతా
ఇంతలోనే చెప్పుకుంటే కొంటె వయసు
అన్నన్నా వదిలైనా నన్నైనా నిన్నైనా ॥
కిన్నెరల్లే కన్నె పరువం కన్నుగీటి కవ్విస్తే
ఉన్నవేడి ఉప్పెనల్లే ఉరకలేసి ఊరిస్తే ॥
చరణం : 2
ఓ... గడుసుగాలి పడుచుమొగ్గ తడిమిపోతే
కాయౌనా పండౌనా కామదేవుని పండగౌనా
కాముడయ్య లగ్గమెట్టి కబురుపెడితే
వారమేలా వర్జమేలా వల్లమాలిన వంకలేలా ॥
ముసురుకున్న ముద్దులన్నీ
మూడుముళ్ల గుర్తులైతే
కలవరించు పొద్దులన్నీ కాగి పోయి కౌగిలైతే ॥బురుజుల॥॥