చిత్రం : అల్లరి బావ (1980)
రచన : వేటూరి
సంగీతం : రాజన్-నాగేంద్ర
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
Photo:రాజన్, నాగేంద్ర
పల్లవి :
మధువనిలో రాధికవో మధువొలికే గీతికవో
మధురం ఈ జీవనం
మధురం ఈ జవ్వనం
మనోహరం... మనోహరం...
మధువనిలో రాధికనో మదిపలికే గీతికనో
మధురం ఈ జీవనం
మధురం ఈ యవ్వనం
మనోహరం... మనోహరం...॥
చరణం : 1
కార్తీకాన కళలే చిలికి వెలిగే జాబిలి
ఎదలో మల్లెల పొదలో వెలిగెను నేడీ జాబిలి
నీలాకాశ వీధుల్లోన వెలిగే సూర్యుడు
వెతలే మాసిన కథలో వెలిగెను నేడీ సూర్యుడు
తొలి తొలి వలపులే...
తొలకరి మెరుపులై...
విరిసే వేళలో... హేళలో... డోలలో... ॥
చరణం : 2
బృందావనికి మురళీధరుడు ఒకడే కృష్ణుడు
ఎదిగిన బాలిక ఎదగల గోపికకతడే దేవుడు
మధురాపురికి యమునా నదికి ఒకటే రాధిక
మరువై పోయిన మనసున వెలసెను
నేడీ దేవత
వెలుగుల వీణలే...
పలికెను జాణలో...
అది ఏ రాగమో... భావమో... బంధమో...॥