Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : జీవన తరంగాలు (1973)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : జె.వి.రాఘవులు
గానం : ఎల్.ఆర్.ఈశ్వరి, బృందం

పల్లవి :
నందామయా గురుడ నందామయా
ఉందామయా తెలుసుకుందామయా
చరణం : 1
మెరిసే సంఘం మేడిపండు
దాని పొట్ట విప్పి చూస్తే పురుగులుండు॥
ఆ కుళ్లు లేని చోటూ ఇక్కడే
అనుభవించు రాజా ఇప్పుడే
ఆనందసారం ఇంతేనయా (2)॥

చరణం : 2
పుట్టినప్పుడు బట్ట కట్టలేదు
పోయేటప్పుడు అది వెంటరాదు॥
నడుమ బట్టకడితే నగుబాటు
నాగరీకం ముదిరితే పొరపాటు
వేదాంతసారం ఇంతేనయా (2)॥

Vanisree & Krishnam Raju in Nandamaya Garuda Nandamaya - Jeevanatarangalu


0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |