Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |




చిత్రం : నీతో (2002)
రచన : చంద్రబోస్, సంగీతం : విద్యాసాగర్,
గానం : విజయ్ ఏసుదాస్, చిత్ర


పల్లవి :

పన్నెండింటికి పడుకుంటే
కొంటెగ కలలోకొస్తావు
అయిదారింటికి మేల్కొంటే
అప్పుడు ఎదుటే ఉంటావు॥
వినవే నా మనసే నీలోనే నిండుందే
కనుకే అది నిన్నే కనిపెడుతూ ఉంటుందే ॥

చరణం : 1

నా గుండె నీలోనే దిండేసి పడుకుందే
నువు దాని ఆకలి దప్పిక అన్నీ తీర్చాలే
చిరుముద్దు పెడతాలే మురిపాలు పడతాలే
పసిపాపలాగా పెంచి పోషిస్తుంటాలే
ఎలా మరి తలస్నానము
అందంతోటి అభిషేకము
అద్దెగా చెల్లిస్తాలే నా ప్రాణము ॥

చరణం : 2

నీ పేరు పలికేటి నీ ఊసు తెలిపేటి
అధరాలు చేసుంటాయి ఎంతో పుణ్యము
నీ వైపు చూసేటి నీ రూపు తడిమేటి
నా కళ్లు చేసుకుంటాయి అంతే పుణ్యము
నిన్ను నన్ను కలిపేయగా
నీలో నాలో తలదాచగా
ప్రేమకే అయ్యిందమ్మా జన్మేధన్యము ॥
Listen :


0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |