Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : సప్తపది (1981)
రచన : వేటూరి, సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల


శ్లోకం : ఓంకార పంజరశుకీం
ఉషనిషదుద్యానకేళి కలకంఠీం
ఆగమ విపిన మయూరీం ఆర్యాం
అంతర్విభావయేత్ గౌరీం

పల్లవి :

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి
పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ ॥
శుభగాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి శర్వార్థగాత్రి శుభగాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి శర్వార్థగాత్రి
సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి
చంద్రప్రభా ధవళకీర్తి (2)
చతుర్బాహు సంరక్షిత శిక్షిత
చతుర్దశాంతర భువనపాలినీ
కుంకుమరాగ శోభినీ కుసుమబాణ సంశోభినీ
మౌనసుహాసిని గానవినోదిని
భగవతి పార్వతిదేవి ॥

చరణం : 1
శ్రీహరి ప్రణయాంబురాశి
శ్రీపాద విచలిత క్షీరాంబురాశి ॥
శ్రీ పీఠ సంవర్థినీ డోలాసురమర్దినీ (2)
ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి (2)
ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి
సకలభోగ సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మిదే వి ॥

చరణం : 2
ఇందువదనే కుందరదనే వీణా పుస్తకధారిణే ఇందువదనే కుందరదనే వీణా పుస్తకధారిణే
శుకశౌనకాది వ్యాస వాల్మీకి
మునిజన పూజిత శుభచరణే (2)
సరస సాహిత్య స్వరస సంగీత స్తన యుగళే సరస సాహిత్య స్వరస సంగీత స్తన యుగళే
వరదే అక్షర రూపిణే శారదే దేవి॥

చరణం : 3
వింధ్యాటవీ వాసినే
యోగ సంధ్యా సముద్భాసినే
సింహాసన స్థాయినే
దుష్టహర రంభక్రియా శాలినే
విష్ణుప్రియే సర్వలోకప్రియే
సర్వనామప్రియే ధర్మసమరప్రియే
హే బ్రహ్మచారిణే దుష్కర్మవారిణే
హే విలంబిత కేశపాశినే
మహిష మర్దన శీల మహిత గర్జనలోల
భయద నర్తన కేళికే కాళికే
దుర్గమాగమ దుర్గవాసినే దుర్గేదేవి

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |