Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : ప్రేమిస్తే(PrEmistE) (2005)
రచన : వేటూరి
సంగీతం : జోష్వా శ్రీధర్
గానం : హరిచరణ్


పల్లవి :

జన్మ నీదేలే మరుజన్మ నీకేలే
జతను విడిచావో చితికిపోతానే
ప్రియతమా... ప్రణయమా...
కుమలకే... ప్రాణమా...
అడుగు నీతోనే... ॥

చరణం : 1

కన్నుల బాధను
కన్నుల నీరే తెలుపును
వలచిన హృదయము తెలుపదులే
గడ్డిలో పిచ్చిగ పూసిన పూవులే
ఎన్నడు దేవత పూజకు నోచవులే
మెరుపుల్లో తీగల మీద
మైనా కడుతుందా గూడు
మన ప్రేమకు ఓటమి రానేరాదు
ప్రతి నదికీ మలుపులు తథ్యం
బ్రతుకుల్లో బాధలు నిత్యం
ఎద గాయం మాన్పును కాలం
సిరివెన్నెల మాత్రం నమ్మి
చిగురాకులు బ్రతుకవు కాదా
మిణుగురులే ఒడి కిరణం

చరణం : 2

తల్లిని తండ్రిని కాదని ప్రేమే కోరిన
చిలుకకు గూడుగా నే ఉన్నా
గుండెపై నీవుగ వాలిన ప్రేమలో
ఎదురుగ పిడుగులే పడినను
విడువనులే
స్నానానికి వేణ్ణీళ్లౌతా
అవికాచే మంటనౌతా
హృదయంలో నిన్నే నిలిపాలే
నిదురించే కంట్లో నేనే
పాపల్లే మేలుకుంటా
కలలోనే గస్తీ కాస్తాలే
నేనంటూ నేనే కాదు
నువు లేక నేనే లేను
నీ కంటి రెప్పల్లే ఉంటా ॥
Special Note:
హరిచరణ్ పూర్తి పేరు హరిచరణ్ శేషాద్రి. ప్లేబ్యాక్ సింగర్‌గా తొలి సినిమా తమిళంలో వచ్చిన కాదల్. అదే తెలుగులో ‘ప్రేమిస్తే’ సినిమాగా వచ్చింది.

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |