చిత్రం : స్టూడెంట్ నెం:1(Student No.1) (2001)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : టిప్పు, బృందం
పల్లవి :
కూచిపూడికైనా ధిరనన
కొంగుపూలకైనా తకధిమి
క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ
ఆనాటి బాలుణ్ణి ఈనాటి రాముణ్ణి
తెలుగింటి కారం తింటూ కలలనుకంటూ పెరిగిన కుర్రోణ్ణి॥నా॥
చరణం : 1
శివధనుస్సునే విరిచిన వాడికి
గడ్డిపరకనే అందిస్తే
వాటే జోక్ వాటే జోక్
హాలహలమే మింగిన వాడికి
కోలాపెప్సీ కొట్టిస్తే
వాటే జోక్ వాటే జోక్
మాన్లీ ఫోజులు మధుర వాక్కులు మ్యాజిక్ చూపులు నా సిరులు
ఒళ్లే కళ్లుగ మెల్ల మెల్లగ నోళ్లే
విప్పరా చూపరులు
ఆబాలగోపాలం మెచ్చేటి మొనగాణ్ణి
తెలుగింటి కారంతో మమకారాన్నే
రుచి చూసిన చిన్నోణ్ణి॥
చరణం : 2
సప్త సముద్రాలీదిన వాడికి
పిల్లకాలువే ఎదురొస్తే
వాటే జోక్ వాటే జోక్
చంద్రమండలం ఎక్కిన వాడికి
చింతచెట్టునే చూపిస్తే
వాటే జోక్ వాటే జోక్
వాడి వేడిగ ఆడిపాడితే
నేడే పోవును మీ మతులు
పోటాపోటీగ పొగరు చూపితే
నాకే వచ్చును బహుమతులు
రెహమాను సంగీతం
మహబాగ విన్నోణ్ణి
మీ కాకికూతలకైనా చేతలు చూపే
సరదా ఉన్నోణ్ణి
దేనికైనా రెడీ... దేనికైనా రెడీ
Another Link:
kUchipUDikaina dhiranana