Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం :బలిపీఠం(BalipITham) (1975)
రచన : డా॥సి.నారాయణరెడ్డి,సంగీతం : చక్రవర్తి,
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల


పల్లవి :
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి (3)
తరతరాలుగా మారనివాళ్లను
మీ తరమైనా మార్చాలి
మారాలి మారాలి మనుషుల గారడి మారాలి
మారాలి మారాలి మనుషుల గారడి మారాలి
మెప్పుల కోసం చెప్పేవాళ్లను
మీ తరమైనా మార్చాలి
మారాలి మారాలి మనుషుల గారడి మారాలి

చరణం : 1
అందరు దేవుని సంతతి కాదా
ఎందుకు తరతమ భేదాలు (2)
అందరి దేవుడు ఒకడే ఐతే (2)
ఎందుకు కోటి రూపాలు
అందరి రక్తం ఒకటే కాదా
ఎందుకు కులమత భేదాలు
అందరి రక్తం ఒకటే అయితే (2)
ఎందుకు రంగుల తేడాలు
మారాలి మారాలి మనుషుల గారడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి

చరణం : 2
తెలిసి తెలిసి బురద నీటిలో ఎవరైనా దిగుతారా
ఆ బురదలోనే అందాల కమలము
పుడుతుందని మరిచేరా
కమలం కోసం బురదలోనే
కాపురముండేదెవరు
మనసులోని బురద కడుగుకొని
మనుషుల్లా బతికేవారు
సమధర్మం చాటేవారు సమధర్మం చాటేవారు
వారిదే ఈనాటి తరం వారిదే రానున్న యుగం వారిదే
ఈనాటి తరం వారిదే రానున్న యుగం
కాదనే వారు ఇంకా కళ్లు తెరవనివారు
మేలుకోక తప్పదులే
మేలుకోక తప్పదులే మారిపోక తప్పదులే
తప్పదులే॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |