Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : 7th సెన్స్(7th Sense) (2011)
రచన : భువనచంద్ర
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : కార్తీక్


పల్లవి :
ముత్యాల ధారని మురిపించే రేయిని
నీ ఒళ్లో హాయిగా
తియతీయగా పవళించనీ
పుష్పించే తోటలో పులకించే గాలినై
తెలవారు జామున
తొలిగీతమే వినిపించనీ
హే హే ప్రియా ప్రియా ప్రియా
ముద్దు మాటలు మళ్లీ మళ్లీ మళ్లీ
విన్న గుండెలో పొంగే పొంగే
మమతలు చూడవా
రావా ప్రియా ప్రియా ప్రియా
కన్నెసొగసై పదే పదే పదే
గుమ్మరిస్తే గుభాళించే
మనసును కానవా

చరణం : 1

ఓ అలలా ఓ... సుమఝరిలా
ఓ... కదులుతున్న
నీ కురులందే నే దాగనా
వరించేటి వెన్నెల నీడై పులకించనా
అరె నిన్నె తాకాలంటూ
మేఘం దాహంతోటి పుడమే చేరెనా
వచ్చి నిన్ను తాకి మళ్లీ దాహం
తీరిందంటూ కడలే చేరెనా
॥హే ప్రియా॥

చరణం : 2

కలనైనా ఓ... క్షణమైనా...
నిన్నే చేరమంటూ ఎదలో పోరాటం
నిన్నే కోరుకుందే నాలో ఆరాటం
పిల్ల చిన్ని బొంగరంలా
నిన్నే చుట్టి చుట్టి తిరిగా కదమ్మా
క్షణం నువ్వే దూరమైతే
గుండె ఆగిపోదా జాలే లేదామ్మా
॥హే ప్రియా॥

7th Sense - Mutyala Dhaarani - Surya - Shruti Hassan




Special Note:

భువనచంద్ర ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 18 ఏళ్లు పనిచేశారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. 1987లో తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆయన పాటలు రాసిన తొలి సినిమా ‘నాకు పెళ్లాం కావాలి’. చాలా డబ్బింగ్ సినిమాలకు కూడా పాటలు రాశారు.

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |