చిత్రం : ఊసరవెల్లి(Oosaravelli) (2011)
రచన : అనంత శ్రీరామ్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : విజయ్ ప్రకాష్, నేహా భసిన్
పల్లవి :
నీహారిక నీహారిక నువ్వే నా దారిక నా దారిక
నీహారిక నీహారిక నువ్వే నేనిక
నీహారిక నీహారిక నువ్వే నా కోరిక నా కోరిక
నీహారిక నీహారిక నువ్వయ్యానిక
నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి
అంటోంది నా ప్రాణమే
నువ్వే నువ్వే రావాలి నువ్వే నువ్వే రావాలి
అంటోంది నా హృదయమే ॥
నీపై ఇష్టమెంతుందో అంటే చెప్పలేను
నిన్నే ఇష్టపడ్డానంటానంతే
నాకై ఇన్ని చేయాలని నిన్నేం కోరుకోను
నాతో ఎప్పుడూ ఉంటానంటే చాలంతే॥
చరణం : 1
రెండు రెప్పలు మూతపడవుగా
నువ్వు దగ్గరుంటే
రెండు పెదవులు తెరుచుకోవుగా
నువ్వు దూరమైతే
రెండుచేతులు ఊరుకోవుగా నువ్వు పక్కనుంటే
రెండు అడుగులు వెయ్యలేనుగా
నువ్వు అందనంటే
ఇద్దరొక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాక
రెండు అన్న మాటెందుకో
ఒక్కసారి నా చెంతకొచ్చినావు నిన్నింక
వదులుకోను చెయ్యందుకో ॥
చరణం : 2
నువ్వు ఎంతగా తప్పు చేసినా ఒప్పులాగే ఉంది
నువ్వు ఎంతగా హద్దు దాటినా
ముద్దుగానే ఉంది
నువ్వు ఎంతగా తిట్టిపోసినా తీయ తీయగుంది
నువ్వు ఎంతగా బెట్టు చూపినా
హాయిగానే ఉంది
జీవితానికీవేళ చివరిరోజు అన్నట్టు
మాటలాడుకున్నాముగా
ఎన్ని మాటలౌతున్నా కొత్త మాటలింకెన్నో
గుర్తుకొచ్చేనే వింత గా ॥