Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : ఒక్కడు (2003)
రచన : సిరివెన్నెల
సంగీతం : మణిశర్మ
గానం : కార్తీక్, చిత్ర

Song: Nuvvem Maya Chesavo
Movie: Okkadu (2003)
Starring: Mahesh Babu and Bhoomika Chawla
Singer: Shreya Ghoshal
Lyrics: Sirivennela Seetharama Sastry
Music: Mani Sharma
Director: Guna Sekhar

పల్లవి :

నువ్వేం మాయ చేశావో గానీ
ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
నువ్వేం మాయ చేశావో గానీ
ఇలా ఈ క్షణం ఆగిపోనీ (2)
హాయ్‌రె హాయ్‌రె హాయ్ అందనీ
రేయిచాటు రాగం విని
ఎవరు తనని పిలిచారని అడిగిచూడు
నీ మనసుని... హే
కాలాన్నే కదలనీయనీ కనికట్టేం జరగలేదనీ
ఈ తీయని మాయ తనదనీ తెలుసా అనీ
మనసూ నీదే మహిమా నీదే
పిలుపూ నీదే బదులూ నీదే॥

చరణం : 1

మూగ మనసిదీ ఎంత గడుసుది
నంగనాచి సంగతులెన్నో వాగుతున్నది
ఓహో ఇంతకాలమూ కంటిపాపలా
కొలువున్న కల నువ్వే అంటున్నది॥
ఎందుకులికి పడుతోందనీ అడిగిచూడు
నీ మనసునీ... హే
నిదురించే నీలికళ్లలో
కల ఎప్పుడు మేలుకున్నదో
ఆ కల ఏం వెతుకున్నదో తెలుసా అని
కనులూ నీవే కలలూ నీవే
పిలుపూ నీదే బదులూ నీదే॥

చరణం : 2

పిచ్చి మనసిది ఎంత పిరికిది
నచ్చుతానో లేదో నీకు అడగమన్నది
ఓహో ఆశ ఆగక అడుగు సాగక
కలలాగ ఎగిరెగిరి పడుతున్నది॥
గాలిపరుగు ఎటువైపనీ అడిగిచూడు
నీ మనసునీ... హే
ఏ దారిన సాగుతున్నదో ఏ మజిలీ చేరుకున్నదో
ఏ తీరం కోరుతున్నదో తెలుసా అని
పదమూ నీదే పరుగూ నీదే
పిలుపూ నీదే బదులూ నీదే॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |