చిత్రం : కన్యాకుమారి (1977)
రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం, గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
(ఇది బాలు సంగీత దర్శకత్వం వహించిన మొదటి సినిమా)
Photo : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
పల్లవి : ఓహో చెలీ... ఓ... నా చెలీ...
ఇది తొలిపాట ఒక చెలిపాట
వినిపించనా ఈ పూట ఆ పాట ॥
చరణం : 1
ఎదుట నీవు ఎదలో నీవు
ఎదిగి ఒదిగి నాతో ఉంటే
మాటలన్నీ పాటలై
మధువులొలుకు మమతే పాట
నీలి నీలి నీ కన్నులలో నీడలైన నా కవితలలో
నీ చల్లని చరణాలే
నిలుపుకున్న వలపీ పాట
పరిమళించు ఆ బంధాలే పరవశించి పాడనా
పాడనా పాడనా ॥చెలీ॥
చరణం : 2
చీకటిలో వాకిట నిలిచి
దోసిట సిరిమల్లెలు కొలిచి
నిదురకాచి నీకై వేచి
నిలువెల్లా కవితలు చేసి
కదలి కదలి నీవొస్తుంటే
కడలి పొంగులనిపిస్తుంటే
వెన్నెలనై నీలో అలనై నీ వెల్లువకే వేణువునై
పొరలి పొంగు నీ అందాలే పరవశించి పాడనా
పాడనా పాడనా ॥చెలీ॥
