Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : ముద్దుల ప్రియుడు (1994)
రచన : వేటూరి, సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : బాలు, చిత్ర, కీరవాణి


పల్లవి :

సిరి చందనపు చెక్కలాంటి భామా
నందివర్థనాల పక్క చేరవమ్మా
వంగి వందనాలు పెట్టుకుందునమ్మా
కొంగు తందనాలు లెక్కపెట్టు మామా
ఒంటిగుంటె తోచదు ఒక్కసారి చాలదు
ఒప్పుకుంటె అమ్మడు తప్పుకోడు పిల్లడు
యమయమా... మామామామా...॥

చరణం : 1

చిక్ చిక్ చిక్ చిక్ చిలకా నీ పలుకే బంగారమా
సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా
నీ అలకే మందారమా
ఇది కోకిలమ్మ పెళ్లి మేళమా... నీ పదమా
అది విశ్వనాథ ప్రేమగీతమా... నీ ప్రణయమా
తుంగభద్ర కృష్ణా ఉప్పొంగుతున్నా
కొంగు దాచే అందాలెన్నమ్మా
ఊపులో ఉన్నాలే భామా॥
చిక్ చిక్ చిక్ చిక్ చిలకా...
సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా...

చరణం : 2

పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి ప్రియుడా
నీ పిలుపే సిరి వాదమా
గుచ్చి గుచ్చి కౌగిలించు గురుడా
నీ వలపే ఒడి వేదమా
ఇది రాధ పంపు రాయబారమా... నీ స్వరమా
ఇది దొంగచాటు కొంగు వాటమా...
ఓ ప్రియతమా
ముద్దు మువ్వ నవ్వు కవ్వించుకున్న వేళ
కవ్వాలటే మోతమ్మా
చల్లగా చిందేసే ప్రేమా...॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |