చిత్రం : 7th సెన్స్(Seventh sense) (2011)
రచన : భువనచంద్ర
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : ఎస్.పి.బాలు, శ్వేతామోహన్
Photo : భువనచంద్ర
పల్లవి :
అమ్మా అమ్మా కన్నె పూవమ్మా
నను నువ్వే విడిచి పోయావేలమ్మా
గుండెల్లోని గాయం చూడమ్మా
నా మానం ప్రాణం నీవేనోయమ్మా
అరె ఆడోళ్ల ప్రేమ ఓ నీటి మూట
మగవాడి ప్రేమ ఓ రాతికోక
కలలోనైనా నిన్నే తలిచేనే
ఆ కలలే రాక మూగై పోయానే
పిల్లనగ్రోవి చేతికి ఇచ్చావే
నా శ్వాసలో నన్నే పట్టుకుపోయావే
చరణం : 1
మగువని నమ్మి చెడిపోయినోళ్లు లక్ష
ఆ వరసన నిలిపి నాకు వేసినావే శిక్ష
పాముకాటు వేస్తే
మన ఊపిరాగుతుందే
కన్నె ప్రేమ పుట్టెనంటే
ప్రతిరోజు చంపుతుంది
అరె చేయి విడిచి నువు పోయాక
గుండె మూగదైపోయింది
నిన్ను నమ్మి నీ వెనకొస్తే
మనసంతా ఓ పొంగైనాది
వలపంటే ఓ ముళ్లబాటరా
అటు నడిచావంటే ఆశే తీరదురా
వలపంటే ఓ మత్తుమందురా
అది వేశావంటే ప్రాణం దక్కదురా॥
చరణం : 2
చిల్లులున్న మురళి
అరె పాటపాడగలదు
గుండె గాయమెంతదైనా
ప్రేమ బాస మరిచిపోదు
ప్రేమ ఉన్నవారు మది వీడి వెళ్లలేరు
నమ్మి మోసపోతి నేడు
ఇది చెప్పలేని గోడు
నను నీటముంచి నీవెళ్లొద్దే
ఎదుట నిలిచి నను చంపొద్దే
కంటిచూపులే కరువైతే
మరుక్షణమేలే మనదే రేయి
వన్నెలు చిలికే రామచిలకమ్మా
ఎద గూటిని దాటి పోయావేలమ్మా
ప్రేమేలేని ఊరే ఏడున్నా
నా కళ్లే మోసి తీసుకుపోవమ్మా॥