Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : వెలుగు నీడలు(Velugu nIDalu) (1961)
రచన : శ్రీశ్రీ
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : పి.సుశీల, స్వర్ణలత


పల్లవి :
చిట్టిపొట్టీ చిన్నారి పుట్టినరోజు
చేరి మనం ఆడేపాడే పండుగరోజు॥
వేడుకుగా ఈ పూట
ఆడుదమా దొంగాట (2)॥

చరణం : 1
కళ్లకు పట్టి చల్లగ కట్టి
వీపుతట్టి పోతాం
తాకినవారి పేరొకసారి
చెప్పవోయి చూదాం
చురుకుతనం బుద్ధిబలం
ఉంటేనే చాలు
చూడకనే తెలియు కదా నిజానిజాలు
వేడుకుగా ఈ పూట
ఆడుదమా దొంగాట (2)॥

చరణం : 2
కన్నులుండి చూడలేరు
కొంతమంది జనం
దారి తప్పి తిరగడమే
తెలివిలేనితనం॥
మెదడు పదును పెట్టాలి
అసలు దొంగను పట్టాలి (2)॥

చరణం : 3
అంబా అనే అరుపు విని
తల్లిని చేరులేగ
నేల మీద పిట్టను పోల్చు
నింగినెగురుడేగ
చీకటైన చిటారుకొమ్మ చేరును కోతి
గురి తెలిసి మసలుకొనే
నిదానమే నీతి
వేడుకుగా ఈ పూట
ఆడుదమా దొంగాట (2)॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |