చిత్రం : కంచుకోట(ka~nchukOTa)(1967)
రచన : దాశరథి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : పి.సుశీల
13 November : నేడు పి.సుశీల బర్త్‌డే
పల్లవి :
ఈ పుట్టినరోజు
నీ నోముల పండిన రోజు
దివిలో భువిలో కనివిని ఎరుగని
అందాలన్ని అందేరోజు ॥పుట్టినరోజు॥
చరణం : 1
తళతళ మెరిసే తారకలారా
ఇలకే దిగిరండీ (2)
మీలో విరిసే లేత వెలుగులు
మా చెలి కన్నుల నింపండి
ఆ వెలుగులలో నా చెలి ప్రియుడు
ఆనందించాలీ॥పుట్టినరోజు॥
చరణం : 2
అలల పూల ఉయ్యాలల
ఆడుకునే హంసలారా (2)
మీ నడకల వయ్యారం
మా చెలికే ఇవ్వరారా
ఆ వయ్యారం చూసి చూసి
ఆమె ప్రియుడు మురియాలి॥పుట్టినరోజు॥
చరణం : 3
పురివిప్పి నటియించు నీలాల నెమలి
పురివిప్పి నటియించు నీలాల నెమలి
మీలోని హొయలంత
చెలికియ్యరాదా
అందాల చెలి నాట్యమాడేటి వేళ
చెలికాని మనసెల్ల విలసిల్ల గలదు...॥పుట్టినరోజు॥
Special Note:
1935లో విజయనగరంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించారు పులిపాక సుశీల. ‘కన్నతల్లి’ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఈ గానకోకిల 50 సంవత్సరాల సినీప్రస్థానంలో ఎన్నో గీతాలను సుమధురంగా వినిపించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ చిత్రాలలో వేలాది పాటలను పాడారు. ఐదు సార్లు జాతీయ పురస్కారం అందుకున్నారు. తన కంఠం మాధుర్యానికి భారత ప్రభుత్వం 2008లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇంకా ఎన్నో అవార్డులు సుశీలమ్మను వరించాయి.