చిత్రం : శంకర్‌దాదా MBBS(SankardAdA MBBS) (2004)
రచన : చంద్రబోస్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : అద్నాన్ సామి, కల్పన
పల్లవి : ఏ జిల్లా ఏ జిల్లా
ఓ పిల్లా నీది ఏ జిల్లా (2)
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలా ఓరుగల్లా
॥జిల్లా॥
ఇరవై మూడు జిల్లాలలోన
ఏదో ఒకటి నీది అయినా
ఇరవై నాలుగు నీ నడుము కొలత
ఐతే చాలులే
ఇరవై ఐదు నిముషాలలోనే
కవ్విస్తాను రావే మైనా
ఇరవై ఆరు ముద్దులు పెట్టి
తకిట తకిట తకిట తా ॥జిల్లా॥
చరణం : 1 నువ్వట్టా జల్సాపూరు
జంక్షన్‌లోకొచ్చేస్తే
నేనిట్టా సిగ్గాపూర్ సిగ్నల్‌నే దాటేస్తా
నువ్వట్టా మనసాపూర్
సెంటర్‌లో మాటేస్తే
నేనిట్టా సరసాపూర్
సంతల్లో వాటేస్తా
కమ్మేస్తాను కోకాకుళంలో
రాజేస్తాను రాణిమండ్రి
ఊరిస్తాను ఊపేశ్వరంలో
ఉడికిస్తానులే
మురిపిస్తాను ముద్దాపురంలో
చేరుస్తాను సోకునాడ
సాగించాలి హింసాచలంలో తకిట
తకిట తకిట తకిట తా ॥జిల్లా॥
చరణం : 2 ఓ నీలోని అందం చందం
అదిరేబాద్ అవుతుంటే
నాలోని ఆత్రం మొత్తం
ముదిరేబాద్ అయిపోదా
నువ్వట్టా కన్నేకొట్టి
గిల్లూరు రమ్మంటే
నేనిట్టా మూటేకట్టి ఒళ్లూరు రాసేస్తా
చంపాపేట సరిహద్దు దాటి
పెదవులపాడు చేరుకుంటా
ఆ పై నేను ఒడివాడలోనే
ఒకటవుతానులే
పగలే కానీ రాత్రైనా గానీ
నిదురానగరు వెళ్లనంటా
పక్కలపల్లి పొలిమేరలోనే తకిట
తకిట తకిట తకిట తా ॥జిల్లా॥