Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : అన్నయ్య(annayya) (2000)
రచన : వేటూరి
సంగీతం : మణిశర్మ
గానం : హరిహరన్, హరిణి


పల్లవి :
హిమసీమల్లో హల్లో
యమగా ఉంది ఒళ్లో
మునిమాపుల్లో ఎల్లో
మురిపాల లోయల్లో
చలి చలిగా తొలి బలిగా
ఈడే ధారపోశా
చలిమిడిగా కలివిడిగా
అందాలారబోశా
పలకలూరి రామచిలక పలుకగనే॥

చరణం : 1
సో సో కాని సోయగమా
ప్రియ శోభనమా
సుఖ వీణ మీటుదమా
వా వా అంటే వందనమా
అభివందనమా
వయసంతా వందనమా
మొహమాటమైన నవమోహనం
చెలగాటమైనతొలి సంగమం
మది రగిలే హిమ మహిమ... ఓ...
అది అడిగే మగతనమా నీదే భామా
పడుచు పంచదార చిలక పలుకగనే॥

చరణం : 2
మా మా అంటే మాధవుడే
జత మానవుడే
పడనీదు ఎండ పొడి
సా సా అంటే సావిరహే
బహు శాఖలహే
నడిజాము జాతరలే
వాటేసుకుంటే వాత్సాయనం
పరువాల గుళ్లో పారాయణం
రవి కనని రచన సుమా... ఓ...
సుమతులకే సుమ శరమా నీవే ప్రేమ
పెదవి ప్రేమలేఖ లిపిని చదవగనే॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |