చిత్రం : ఇంద్రుడు చంద్రుడు(IndruDu ChandruDu) (1989)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు
Photo:S.P. Balu
పల్లవి :
లాలిజో లాలిజో ఊరుకో పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి॥
తెలుసా ఈ ఊసు
చెబుతా తల ఊచు
కాపురం చేస్తున్న పావురం ఒకటుంది
ఆలినే కాదందీ కాకినే కూడింది
అంతలో ఏమైంది అడగవే పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
చరణం : 1
మాయనే నమ్మింది
బోయతో పోయింది
దెయ్యమే పూనిందో
రాయిలా మారింది
వెళ్లే పెడదారిలో ముళ్లే పొడిచాకనే
తప్పిదం తెలిసింది
ముప్పునే చూసింది
కన్నులే విప్పింది గండమే తప్పింది
ఇంటిలో చోటుందా
చెప్పవే పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
చరణం : 2
పిల్లలు ఇల్లాలు ఎంతగా ఏడ్చారు
గుండెలో ఇన్నాళ్లు కొండలే మోశారు
నేరం నాదైనా భారం నీపైనా
తండ్రినే నేనైనా
దండమే పెడుతున్నా
తల్లిలా మన్నించు మెల్లగా దండించు
కాళిలా మారమ్మా కాలితో త న్నమ్మా
బుద్ధిలో లోపాలే దిద్దుకోనీవమ్మా॥
Special Note:
‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న (1967)’ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం... గాయకుడిగానే కాక సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సుపరిచితులు. కమల్‌హాసన్‌కు బాలు ఇచ్చిన డబ్బింగ్ వింటే అది కమల్‌హాసన్ మాట్లాడినట్లే ఉంటుంది. అందుకే కమల్‌హాసన్‌కు బాలు పాడితే ఆ పాట కమల్‌హాసనే పాడుతున్నట్టు అనిపిస్తుంది. బాలు గాత్రం కమల్‌కు అంత అతికినట్టుగా ఉంటుంది.