Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం:శ్రీవారికి ప్రేమలేఖ(SrIvAriki prEmalEkha)(1984)
రచన : వేటూరి
సంగీతం : రమేష్‌నాయుడు
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
26 November - నేడు రమేష్‌నాయుడు జయంతి


పల్లవి :
లిపిలేని కంటి బాస
తెలిపింది చిలిపి ఆశ
నీ కన్నుల కాటుక లేఖలలో
నీ సొగసుల కవితా రేఖలలో
ఇలా ఇలా చదవనీ
నీ లేఖనీ ప్రణయలేఖని
బదులైన లేని లేఖ
బ్రతుకైన ప్రేమలేఖ
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా ఇలా రాయనీ
నా లేఖనీ ప్రణయలేఖని॥

చరణం : 1
అమావాస్య నిశిలో
కోటి తారలున్న ఆకాశం
వెలుగుతోంది వేదన తానై
విదియనాటి జాబిలి కోసం
వెలుగునీడలెన్నున్నా
వెలగలేని ఆకాశం... ఊ...
ఎదుగుతూ ఉంది వెన్నెల తానై
ఒక్కనాటి పున్నమి కోసం॥

చరణం : 2
అక్షరాల నీడలలో
నీ జాడలు చూసుకుని
ఆ పదాల అల్లికలో
నీ పెదవులు అద్దుకుని
నీకంటికి పాపను నేనై
నీ ఇంటికి వాకిలి నేనై
గడప దాటలేక నన్నే గడియ
వేసుకున్నాను
గడియైన నీవు లేక
గడపలేక ఉన్నాను॥॥

Listen Audio:
lipilEni kaNTi basa

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |