చిత్రం : సోలో(sOlO) (2011)
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : మణిశర్మ
గానం : హరిచరణ్
పల్లవి :
నా ప్రేమ కథకు నేనే కదా విలను
నా రాత నాది తప్పు ఎవరిదననూ॥ప్రేమ॥
అరె... గుండె తీసి దానమిచ్చినాను
ప్రేమ కర్ణుడల్లె పొంగిపోయాను
కనరాని గాయమై పోను పోను
కన్నీటి తడిని లోన దాచినాను
ఏమి చెప్పను మామా అరె ఎంతని చెప్పను మామా
ఆడి తప్పని ప్రేమ
ఇది గాడి తప్పిన ప్రేమ
విశ్వదాభిరామ వినుర వేమ!
గొంతు దిగని గరళమేరా ప్రేమ!॥
చరణం : 1
కన్ను నాదే వేలు నాదే
చిటికెలోనె చీకటాయె జీవితం
వాడిపోదే వీడిపోదే
ముల్లులాగ గిల్లుతుంది జ్ఞాపకం
ఏ పెద్దమ్మ కూర్చుందో నెత్తి మీద పోటుగాడిలాగ పాటించా మర్యాద
నా కొమ్మను నేనే నరుక్కున్నా కాదా
తలుచుకుంటే పొంగుతోంది బాధ॥॥
చరణం : 2
అమ్మ లేదు నాన్న లేడు
అక్క చెల్లి అన్న తంబి లేరులే
అన్నీ నువ్వే అనుకున్న ప్రేమ
చేతులారా చేయిజారి పోయెనే
ఈ సోలో లైఫులోన ఒక్క క్షణము
ఎందుకొచ్చిందో
ఇంత కాంతి వెళ్లిపోను
సర్లే అనుకున్నా సర్దుకోలేకున్నా
అగ్నిగుండం మండుతోంది లోన॥॥