చిత్రం : పూజ(pUja) (1979)
రచన : దాశరథి
సంగీతం : రాజన్-నాగేంద్ర
గానం : వాణీజయరామ్
30 November - వాణీజయరామ్ బర్త్‌డే
పల్లవి :
పూజలు చేయ పూలు తెచ్చాను (2)
నీ గుడి ముందే నిలిచాను
తియ్యరా తలుపులను రామా
ఇయ్యరా దరిశనము రామా
పూజలు చేయ పూలు తెచ్చాను
చరణం : 1
తూరుపులోన తెలతెలవారే
బంగరు వెలుగు నింగిని చేరే॥
తొలి కిరణాల... ఆ...
తొలి కిరణాల హారతి వెలిగే
ఇంకా జాగేలా స్వామీ
ఇయ్యరా దరిశనము రామా॥
ఇయ్యరా దరిశనము రామా
పూజలు చేయ పూలు తెచ్చాను
చరణం : 2
దీవించేవో కోపించేవో
చెంతకు చేర్చి లాలించేవో (2)
నీ పద సన్నిధి నా పాలిటి పెన్నిధి నీ పద సన్నిధి నా పాలిటి పెన్నిధి
నిన్నే నమ్మితిరా స్వామీ
ఇయ్యరా దరిశనము రామా॥
ఇయ్యరా దరిశనము రామా
పూజలు చే...య
పూ...లు తెచ్చా...ను
Special Note:
ఆమె పేరు వాణీ, భర్త పేరు జయరామ్... కలిపి ప్రసిద్ధి గాయనిగా పేరు ప్రతిష్టలు
సంపాదించారు వాణీజయరామ్. దక్షిణ భారతదేశంలో 14 భాషలలో సుమారు 8వేలకు
పైగా పాటలు పాడారు.
స్వస్థలం వేలూరు (తమిళనాడు). వాణీజయరామ్‌ను మూడుసార్లు
జాతీయ అవార్డులు వరించాయి. తమిళ చిత్రమైన ‘అపూర్వ రాగంగళ్’కు తొలి జాతీయ
అవార్డు అందుకున్నారు. ఆ తరువాత తెలుగులో ‘శంకరాభరణం’, ‘స్వాతికిరణం’
చిత్రాలకు మరో రెండుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు.