చిత్రం : సాగరసంగమం(sAgara sa~mgamam) (1983)
రచన : వే టూరి
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు
07 November - నేడు కమల్‌హాసన్ బర్త్‌డే
పల్లవి :
తకిట తధిమి
తకిట తధిమి తందానా
హృదయ లయల
జతుల గతుల తిల్లానా ॥
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన॥
శ్రుతిని లయని ఒకటి చేసి ॥
చరణం : 1
నరుడి బ్రతుకు నటన
ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్టనడుమ
నీకెందుకింత త పన ॥
తెలుసా మనసా
నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని
ఆశల వయసీ వరసా ॥
తెలుసా మనసా
నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని
ఆశల లలలా లలలా
ఏటిలోని అలల వంటి కంటిలోని
కలలు కదిపి గుండియలను
అందియలుగ చేసి ॥
తడబడు అడుగుల తప్పని తరిగి
డదోం తరిగిడదోం తరిగిడదోం
తడిసిన పెదవులు రేగిన ఆ ఆ ఆ...
శ్రుతిని లయని ఒకటి చేసి ॥
చరణం : 2
పలుకు రాగ మధురం
నీ బ్రతుకు నాట్యశిఖరం
సప్తగిరులుగా వెలిసే
సుస్వరాల గోపురం ॥
అలరులు కురియగనాడెనదే
అలకల కులుకుల అలమేల్మంగా॥
అన్న అన్నమయ్య మాట
అచ్చ తేనె తెనుగుపాట
పల్లవించు పద కవితలు పాడీ...॥॥
శ్రుతిని లయని ఒకటి చేసి ॥
Another Link:
takiTa tadhimi takiTa tadhimi