Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : బొబ్బిలిరాజా(bobbili rAjA) (1990)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, చిత్ర
13 December - నేడు వెంకటేష్ బర్త్‌డే


పల్లవి :
బలపం పట్టి
భామ బళ్లో
అఆఇఈ నేర్చుకుంటా
పంతం పట్టి ప్రేమ ఒళ్లో
ఆహా ఓహో
పాడుకుంటా
అం అః అంటా అమ్మడూ
హొయ్యారే హొయ్యారే హోయ్
కమ్మహా ఉండేటప్పుడు
బుజ్జిపాపాయి పాఠాలు నేర్పించు
పైటమ్మ ప్రణయాలతో
సరసమింక ఎక్కువైతే
చ ఛాఛిఛీ తప్పదయ్యో
అపుడే ఇంత ప్రేమ బళ్లో
అయితే గియితే ఎందుకయ్యో
అచ్చులే అయ్యా యిప్పుడూ
హొయ్యారే హొయ్యారే హోయ్
హల్లుల్లో హల్లో ఎప్పుడు

చరణం : 1
ఎట్టాగుందె పాపా
తొలిచూపే చుట్టుకుంటే
ఏదో కొత్త ఊపే
ఎటు వైపో నెట్టేస్తుంటే
ఉండుండి ఎటుంచో
ఒక నవ్వే తాకుతోంది
మొత్తంగా ప్రపంచం
మహ గమ్మత్తుగా ఉంది
ప్రేమంటే ఇంతేనేమో
బాగుందే ఏమైనా
నాక్కూడా కొత్తేనయ్యో
ఏం చేద్దాం ఈపైనా
కాస్తయినా కంగారు తగ్గాలి
కాదన్ను ఏం చేసినా॥॥అః॥

చరణం : 2
తుప్పల్లో తుపాకి
సడి ఎట్టా రేగుతుందో
రెప్పల్లో రహస్యం
పడి అట్టా అయ్యిందయ్యో
కొమ్మల్లో కుకులే
మన స్నేహం కోరుతుంటే
కొండల్లో ఎకోలే
మనమెట్టా ఉన్నామంటే
అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా
ఎవరెవరో అత్తా మామా
వరసెట్టా తెలిసేనే
అందాకా ఆ మర్రి అత్తమ్మ
ఈ మద్ది మామనుకో॥॥
పిచ్చి బుజ్జాయి అల్లర్లు తగ్గించి
ఒళ్లోన బజ్జోవయ్యో॥॥॥అః॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |