చిత్రం : ఎర్రసైన్యం(errasainyam) (1994)
రచన : భానూరి సత్యనారాయణ(bhanUri satyanArAyaNa)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్(vandEmAtaram SrInivAs)
గానం : వందేమాతరం శ్రీనివాస్(vandEmAtaram SrInivAs)
31 December - నేడు ఆర్.నారాయణమూర్తి బర్త్‌డే
పల్లవి : బంజారే... బంజారే...
బంజారే బంజో ఓనారే బంజా
ఓ నారే ఆ నారే ఓనారే బంజా॥
చరణం : 1
చుక్కపొద్దూ లేచామమ్మా
చందమామ... చందమామ
సద్ది సంకన కట్టామమ్మా
చందమామ... చందమామ
ఎలపట దాపట ఎడ్లను కట్టి
కర్రునాగలి భుజానబెట్టి
సెమట చుక్కలు జల్లి
సేలు సెలకలు దున్ని
రాజనాలు పంచా... ఓ...
రేలారే రేలారాయిలర రేలారే॥
చరణం : 2
అడవితల్లి బిడ్డలమమ్మా
చందమామ... చందమామ
అన్నెం పున్నెం ఎరగనోళ్లం
చందమామ... చందమామ
కొండల్ని ఏలేటి మత్తుల్ని నరికి
బల్లకట్టునే పల్లకీ చేసి (2)
గలగల పారేటి గోదారి
ఒడిచేర్చి కలప సాగనంపా॥॥
చరణం : 3
కొండోళ్లు కోయోళ్లు గోను జాతోళ్లం
చందమామ... చందమామ
మారేడు నేరేడు పళ్లను ఏరాం
చందమామ... చందమామ
అడ్డాకు తునికాకు ఆకుల్ని కోసి
చెట్టుమీద తేనెపట్టును తీసి
ఇప్పబట్టి పెట్టి గుక్క గుక్క తాగి
జాతరలే చేశాం॥॥