రచన : బలిజేపల్లి లక్ష్మీకాంతం(balijEpalli lakshmIkantam)
సంగీతం : ఓగిరాల రామచంద్రరావు(OgirAla rAmachandrarAo)
గానం : టి.జి.కమలాదేవి(T.G.kamalAdEvi)
29 December - నేడు టి.జి.కమలాదేవి పుట్టినరోజు
పల్లవి :
వయ్యారి మనో మోహన
ఆహా మోహన... ఆ...
చరణం : 1
నీ రుచులేవో తెల్పవోయి (2)
ఆ... ఆరగింపవా విందారగింపవా
తాయములా మంచి తాయములా తాయములా మంచి తాయములా
ప్రేమసుధా హారమునోయి
భలే కోవా మీగడ జావా (2)
ఆకొంటివే మూగదోయి॥
నా జగన్మోహన...
చరణం : 2
రామచిలుకా బావా
నన్నే ప్రేమింపలేదా(2)
ప్రేమింపనేలేదా పలుకవిదేమో (2)
ఈడౌనా జోడౌనా మైనా (2)
ఔనుగదే వరసౌనుగదే శారికా (2)
హా... ఇది నీకు చక్కెరఖానా
గైకోవే చక్కెరఖానా
Special Note:
టి.జి.కమలాదేవి పూర్తిపేరు తోట గోవిందమ్మ. 1929 డిసెంబర్ 29న చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగరంలో కృష్ణస్వామి నాయుడు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. ఈమెకు నలుగురు అక్కచెల్లెళ్లు, ఒక తమ్ముడు. ఏడవ ఏటనే తల్లి ప్రోత్సాహంతో శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్న కమలాదేవి పుత్తూరులోని అమెరికన్ స్కూల్లో మెట్రిక్ పూర్తి చేశారు. స్కూల్లో చదువుకుంటూనే వార్షికోత్సవ నాటకాల్లో ‘జ్ఞానసుందరి’, ‘భూపత్రి’ మొద లైన పాత్రలు ధరించారు. రంగస్థలం, సినిమా, రేడియో ఈ మూడు రంగాల్లోనూ మంచి పేరు తెచ్చుక్నున కళాకారిణిగా, మధుర గాయనిగా, ఉత్తమ సామాజిక సేవకురాలిగా, బిలియర్డ్స్ చాంపియన్‌గా, దశాబ్దాల చరిత్రగల చెన్నపురి ఆంధ్ర మహాసభ సెక్రటరీగా, ప్రెసిడెంటుగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు.
Comments