చిత్రం : పిల్ల జమీందార్(pilla zamIndAr)(2011)
రచన : కృష్ణచైతన్య
సంగీతం : సెల్వ గణేష్
గానం : కార్తీక్, చిన్మయి
పల్లవి :
ఊపిరి ఆడదు నాకు ఎదురు నువ్వైతే
కొనఊపిరితో ఉన్నా
ప్రాణం పొయ్యవే ॥
నా మనసే నన్నే వదిలి వెళుతుందే
నీతో ఎటువైపో
ఈ క్షణం అయోమయం
ఇంతగా నన్నే కలవరపెడుతుందే
తడబడి తడబడి రా తేనె పలుకై రా
కనపడి కలబడినా
ప్రేమే ముడిపడునా
మధురం మధురం
మధురం
ఈ పరువం మధురం
ఊపిరి ఆడదా నీకు ఎదురు నువ్వైతే
నేనేం చేశా నేరం ప్రాణం తీయకే
ప్రణయం పదిలం అంటూ
నా ప్రాణం కుదిపేశావే
అలకల కులుకే అందం ఓ కిలకిల
చిలుక రావే రావే నీ కోసమా
మధురం మధురం పరువం॥మనసే॥
రా ఇలా సరాసరి అనదే
మరి నా మనసెందుకో
చరణం : 1
గడసరి మగసిరి నిన్ను కోరింది
సొగసిరి ఎద మరి తీరే మారింది
గుప్పెడు మనసే అలా ఎలా కొట్టేశావే
కనికట్టేదో కథాకళి కట్టిస్తుందే
మరువం మరువం పరువం
చేసే గాయాలే
ఊపిరి ఆడదు నాకు ఎదురు నే రానా
కొనఊపిరితో ఉన్నా
ప్రాణం నేనవనా ॥
నా కోసమే...
మధురం మధురం ప్రణయం
చరణం : 2
చినుకునై చిలిపిగా నిన్ను తడిమైనా
గొడుగునై సొగసుపై నిన్ను ఆపేయనా వయసొక నరకం వాంఛలే వేధిస్తుంటే
తీయని తమకం అమ్మో భయం
ఏం చేస్తుందో॥॥
నాకోసమే... నీ కోసమే...
మధురం మధురం పరువం