చిత్రం : అమాయకుడు(amAyakuDu) (1968)
రచన : వే ణుగోపాల్
సంగీతం : బి.శంకర్
గానం : ఎల్.ఆర్.ఈశ్వరి
08 December - నేడు ఎల్.ఆర్.ఈశ్వరి బర్త్‌డే
పల్లవి :
పట్నంలో శాలిబండ
పేరైనా గోలకొండ (2)
సూపించు సూపునిండా
ఫిసల్ ఫిసల్ బండ ॥
చరణం : 1
వయసు పిల్ల వంటి సొంపు
అది వంగి ఉంటె భలే ఇంపు
హహహ...
అది వంగి ఉంటె భలే ఇంపు
అబ్బ అబ్బ...
అది వంగి ఉంటె భలే ఇంపు
ఓరసూపు వలవేసి
దోరవయసు దోచేసి (2)
గులకరాళ్ల నీటిలోన
సెలయేటి బాటలోన (2)
ఒక్కసారి సూడాలి
సంబరాల చాటుబండ
ఫిస
ల్ ఫిసల్ బండ॥
చరణం : 2
చేప కనుల చిన్నదోయి
నీ చేతికైతే చిక్కదోయి (2)
అల్లిబిల్లి అయి వుందా
బల్లపరుపు అల్ల బండా
అయ్యో అయ్యో అయ్యో...
బల్లపరుపు అల్ల బండా
ఆ... బల్లపరుపు అల్ల బండా॥
Special Note:
ఎల్.ఆర్.ఈశ్వరి రోమన్ క్యాథలిక్ కుటుంబంలో మద్రాసు (చెన్నై) లో జన్మించారు. ఈమె అసలు పేరు ‘లూర్డ్ మేరీ’, ఆమె బామ్మ హిందూ కావడంతో ముద్దుగా రాజేశ్వరి అని పిలిచేవారు. తమిళ చిత్ర నిర్మాత ఎ.పి.నటరాజన్ ఈమె పేరును సినిమాల కోసం ఎల్.ఆర్.ఈశ్వరిగా మార్చారు. ఈ పేరుతోనే తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ, తుళు, ఇంగ్లిష్ భాషలలో కొన్ని వేల పాటలు పాడారు. ఈమెకున్న విలక్షణమైన గొంతే గొప్ప పేరు ప్రఖ్యాతులను తెచ్చింది.