చిత్రం : ఇంద్ర(Indra) (2002)
రచన : భువనచంద్ర
సంగీతం : మణిశర్మ
గానం : ఉదిత్ నారాయణ్, చిత్ర
పల్లవి : సిమ్మా సిమ్మాలే...
సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే (2)
రాధే గోవిందా ప్రేమే కుట్టిందా
కసిగా రమ్మంటూ కబురెట్టిందా
కృష్ణా ముకుందా కన్నె కిష్కింధా
జడతో నా మనసు లాగేసిందా
ప్రియ పురుషా వరసా
ఇహ కలిపేయమంటు
మృదువదనా పతినై పరిపాలించనా
చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే
అంతగా నచ్చావమ్మో
అనసూయమ్మా॥
చరణం : 1
నీకోసమే పుట్టానని
ఊరించకోయ్ వాత్సాయనా
నాకోసమే వచ్చావని
వాటేసినా వయ్యారమా
తొలిప్రేమ జల్లులే కురవాలంటా
పరువాల పంటలే పండాలంట
చెలి బుగ్గ సిగ్గుతో మెరవాలంట
కౌగిళ్ల జాతరే జరగాలంట
అరె ఆకలి వేస్తే సోకులు ఇస్తా
సోకులతోటే షాకులు ఇస్తా
ఒడిలో సరాసరి పడకేసెయ్ మావా
కృష్ణా ముకుందా కన్నె కిష్కింధా
కిస్ మై లిప్సంటూ కవ్వించిందా॥
చరణం : 2
అంగాంగమూ వ్యామోహమే
నీ పొందుకై ఆరాటమే
వదిలేసొ నీ మోమాటమే
సాగించవోయ్ సల్లాపమే
రతిరాణి దర్శనం ఇవ్వాలంట
ఏకాంతసేవనే చెయ్యాలంట
కసిగువ్వ రెక్కలే విప్పిందంటా
నీకోసం పక్కలే పరిచిందంట
అరె మెత్తగ వస్తే హత్తుకుపోతా
హత్తుకు నిన్ను ఎత్తుకుపోతా
సిరినే మగసిరితో దోచేస్తా భామా॥