చిత్రం : ఇది కథ కాదు(idi katha kAdu) (1979)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
17 December - నేడు జయసుధ బర్త్‌డే
పల్లవి : సరిగమలు... గలగలలు...(2)
ప్రియుడే సంగీతము
ప్రియురాలే నాట్యము
చెలి కాలి మువ్వల గలగలలు(2)
చెలికాని మురళిలో...॥
చరణం : 1
ఆవేశమున్నది ప్రతి కళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో॥
కదిలీ కదలక కదిలించు కదలికలు కదిలీ కదలక కదిలించు కదలికలు
గంగా తరంగాల శృంగార డోలికలు॥
చరణం : 2
హృదయాలు కలవాలి ఒక శ్రుతిలో
బ్రతుకులు నడ వాలి ఒక లయలో
శ్రుతిలయలొకటైన
అనురాగ రాగాలు
జతులై జతలైన నవరస భావాలు॥
చరణం : 3
నయనాలు కలిశాయి ఒక చూపులో
నాట్యాలు చేశాయి నీ రూపులో॥
రాధనై పలకనీ నీ మురళి రవళిలో
పాదమై కదలనీ నీ నాట్య సరళిలో॥
Special Note:
సహజనటిగా పేరుపొందిన జయసుధ అసలు పేరు సుజాత. మద్రాస్‌లో పుట్టి పెరిగినా ఈమె మాతృభాష తెలుగు. 1972లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన ‘పండంటి కాపురం’ ఈమె మొదటి చిత్రం. 300లకు పైగా సినిమాల్లో నటించారు. నటిగా, సహాయనటిగా, నిర్మాతగా తెలుగువారిని మెప్పించారు. ఆరుసార్లు ఫిలింఫేర్, నంది అవార్డులు, ఇతర అవార్డులు ఎన్నో వరించాయి.
