చిత్రం : అప్పు చేసి పప్పుకూడు(appu chEsi pappu kUDu) (1959)
రచన : పింగళి నాగేంద్రరావు(pi~mgali nAgEndrarAvu)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు(sAlUri rAjESwararAvu)
గానం : లీల(leela), ఘంటసాల(ghanTasAla), ఎ.ఎం.రాజా(A.M.rAjA)
28 December - రేపు పింగళి నాగేంద్రరావు జయంతి
పల్లవి : సుందరాంగులను చూసిన వేళల
కొందరు ముచ్చట పడనేలా
కొందరు పిచ్చను పడనేలా ॥
చరణం : 1
అందము ప్రాయము ఐశ్వర్యము గల
సుందరి దొరకుటె అరుదు కదా ॥
ముందుగ ఎవరిని వరించునోయిని
తొందరలో మతిపోవు కదా ॥
చరణం : 2
హృదయమునందలి ప్రేమగీతమే
మధురముగా వినిపించు కదా॥
మందహాసమున మనసును దెలిపే
ఇందువదన కనువిందు కదా
ప్రేమ పరీక్షలు జరిగే వేళల
కొందరు పరవశ పడనేలా
కొందరు కలవర పడనేలా
చరణం : 3
యువతి చెంత పర పురుషుడు నిలిచిన
భావావేశము కలుగు కదా ॥
ప్రేమ పందెమును గెలిచే వరకు
నా మది కలవరపడును కదా
ప్రేమ పరీక్షలు జరిగే వేళల
కొందరు కలవర పడనేలా
కొందరు పరవశ పడనేలా
చరణం : 4
కోయిల పలుకుల కోమలి గాంచిన
తీయని తలపులు కలుగు కదా॥
వరములొసంగే ప్రేమదేవి గన
పరవశమే మది కలుగు కదా॥