Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Featured Post

bham bham bOlE Sankham - భం భం బోలే శంఖం

చిత్రం : ఇంద్ర(indra) (2002)
రచన : సిరివెన్నెల(sirivennela)
సంగీతం : మణిశర్మ(maNiSarma)
గానం : శంకర్‌మహదేవన్, హరిహరన్(SankarmahadEvan, harifaran)


పల్లవి :
భం భం బోలే శంఖం మోగెలే
ఢం ఢం ఢోలే చెలరేగిందిలే॥భం॥
తధినకధిం దరువై సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై
ముందుకు సాగనీ॥
విలాసంగా శివానందలహరి
మహాగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగా చేరి
వరాలిచ్చే కాశీపురీ॥భం॥॥॥
చరణం : 1
వారణాసిని వర్ణించే నా గీతిక
నాటి శ్రీనాథుని కవితై వినిపించదా
ముక్తికే మార్గం చూపే మణిక ర్ణిక
అల్లదే అందినాయి చిరుఘంటిక
నమక చమకాలై
ఎదలయలే కీర్తన చేయగా
యమక గమకాలై
పదగతులే న ర్తన చేయగా
ప్రతీ అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా॥
కార్తీకమాసాన వేవేల దీపాల
వెలుగంత శివలీల కాదా...
ప్రియమార మదిలోన ఈశ్వరుని
ధ్యానిస్తే మనకష్టమే తొలగిపోదా
చరణం : 2
ఎదురయే శిల ఏదైనా శివలింగమే
మన్ను కాదు మహాదేవుని
వరదానమే
చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే
చరితలకు అందనిదీ కైలాసమే
గాలిలో నిత్యం వినలేదా
ఆ ఓంకారమే
గంగలో నిత్యం కనలేదా
శివకారుణ్యమే
తరలిరండి తెలుసుకోండి
కాశీమహిమ ॥॥భం॥॥॥

Comments