చిత్రం : పాండురంగ మహాత్మ్యం(pANDura~nga mahAtmyam (1957)
రచన : సముద్రాల రామానుజాచార్య(samudrAla rAmAnujAchArya)
సంగీతం : టి.వి.రాజు(T.V.rAju)
గానం : పిఠాపురం, మాధ వపెద్ది సత్యం(piThApuram,mAdhavapeddi satyam)
పల్లవి :
చెబితే వింటివా గురూ గురూ
వినకే చెడితిరా శిష్యా శిష్యా
నే వినకే చెడితిరా శిష్యా శిష్యా॥చెబితే॥
చరణం : 1
ఇహపరాలకు బేరులు వద్దు
కూటి కొరకు పెడదారులు వద్దని
చె బితే వింటివా గురూ గురూ
నే చె బితే వింటివా గురూ గురూ॥
ఇహం పోయెరా... పరం పోయెరా...
ఇహం పోయెరా... పరం పోయెరా...
దాసుగాడిదీ దస్తం పోయెరా॥
అవును...॥చెబితే॥
చరణం : 2
చెరపబోకురా చెడతావంటే
చెవిని బెడితివా గురూ గురూ
నే చె బితే వింటివా గురూ గురూ॥
తాను తీసిన గోతులలోన...
తాను తీసిన గోతులలోన
తానే పడటం తప్పదు శిష్యా॥॥చెబితే॥
Special Note:
సముద్రాల రాఘవాచార్యులు (సముద్రాల సీనియర్), రత్నమ్మ దంపతులకు జన్మించారు సముద్రాల రామానుజాచార్యులు (సముద్రాల జూనియర్). వీరి స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె తాలుకా పెదపులివర్రు గ్రామం. రత్నమ్మగారి తండ్రి పేరునే రామానుజాచార్యకు పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచే సంగీతం, సాహిత్యం, సంస్కృతం పట్ల ఇష్టం ఉండటంతో 1952లో వినోదావారు నిర్మించిన ‘శాంతి’ చిత్రానికి పాటలు రాసి తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు.
సముద్రాల రామానుజాచార్య