చిత్రం : అమరదీపం(amaradeepam) (1976)
రచన : ఆచార్య ఆత్రేయ(AchArya AtrEya)
సంగీతం : సత్యం (satyam)
గానం : ఎస్.పి.బాలు(S.P.BAlu), పి.సుశీల(P.suSeela)
12 January - నేడు సత్యం వర్ధంతి
పల్లవి :
ఏ రాగమో
ఇది ఏ తాళమో (2)
అనురాగాని కనువైన
శ్రుతి కలిపినామో
ఏ రాగమో
ఇది ఏ తాళమో (2)
మన కల్యాణ
శుభవేళ
మోగించు మేళమో
ఏ రాగమో
ఇది ఏ తాళమో
చరణం : 1
ఎదలో మెదిలే సంగతులన్నీ
పలికెను సంగీతమై
పలికెను సంగీతమై...
కలిసిన కన్నుల మెరిసే కళలే
వెలిసెను గమకములై
వెలిసెను గమకములై...
హొయలైన నడకలే లయలైనవి
చతురాడు నవ్వులే గతులైనవి
సరి సరి అనగానే
మరి మరి కొసరాడు
మురిపాలె మన
జంట స్వరమైనది॥రాగమో॥
చరణం : 2
విరికన్నె తనకు
పరువమే కాదు
పరువూ కలదన్నది
పరువూ కలదన్నది...
భ్రమరము తనకు
అనుభవమే కాదు
అనుబంధముందన్నది
అనుబంధముందన్నది...
కోకిలమ్మ గుండెకు గొంతున్నది
కొమ్మలో దానికి గూడున్నది
సరి మగవానికి సగమని తలపోయు
మన జంటకే జంట సరి ఉన్నది॥రాగమో॥
Special Note:
సత్యం పూర్తిపేరు చెళ్లపిళ్ల సత్యనారాయణశాస్త్రి. 1933లో విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం గుణానుపురం అగ్రహారంలో అప్పల నరసింహులు, కాంతమ్మ దంపతుల మొదటి సంతానం సత్యం. తమ్ముళ్లు రాజేశ్వరరావు, సూర్యనారాయణ.