Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : రాక్షసుడు(rAkshasuDu) (1986)
రచన : వేటూరి(vETUri)
సంగీతం : ఇళయరాజా (iLayarAjA)
గానం : ఎస్.పి.బాలు(S.P.bAlu), ఎస్.జానకి(S.jAnaki)

పల్లవి : గిలిగా గిలిగిలిగా గిలిగింతగా
కసిగా కసికసిగా కవ్వింతగా
ఒళ్లంతతుళ్లింతలై...
వాటేసుకున్నంతలై
వాటేసుకున్నంతలై...
జపించి నీ పేరే నే తపించిపోతున్నా తెలుసా హే పురుషోత్తమా॥
చరణం : 1
వయసే నడినెత్తికెక్కింది ఈ పూట పైటే చలిపుట్టి జారిందయ్యో
వలపే కుడికన్ను కొట్టింది రమ్మంటా పెదవే తడిచేసుకుందామమ్మో
ఒదిగీ ఒకటైతే ఒకటే గొడవైతే ఇంకా ప్రేమకథా ముదిరేనయ్యా
పసుపు చెక్కిళ్లో ఎరుపు దుమారం
చిలిపి చూపులకే వణికే వయ్యారం
పగలే కోరికలు పడుచు అల్లిక లు
ముదిరి ముదిరి మనువు కుదిరి
మనసు మనసు కలిసిన సిరిలో ॥
చరణం : 2
ఎండా వానల్లో నీళ్లాడే అందాలు
ఎదలో చప్పట్లే వేసేనమ్మా
మసక చీకట్లో చిగురేసే పరువాలు
మతినే పోగొడితే ఎట్టాగయ్యో
నిదరే కరువైతే కలలే బరువైతే
వ యసు గుప్పిళ్లే తెరవాలమ్మో
సొగసు తోటల్లో పడుచు వయారం
వడిసి పట్టగనే ఎంత సుతారం
అడిగే కానుకలు కరిగే కాటుకలు
చిలిపి చిలిపి వలపు లిపిని
కలికి చిలుక గిలికిన సడిలో ॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |