Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : ఉగాది(ugAdi) (1997)
రచన : సిరివెన్నెల(sirivennela)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి(S.V.Krishna Reddy)
గానం : ఉన్నికృష్ణన్, బృందం(unnikrishnan & Group)
Photo:ఎస్.వి.కృష్ణారెడ్డి(S.V.Krishna Reddy)


పల్లవి :
ఇన్నాళ్లూ ఏ మబ్బుల్లో దాగున్నావో
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
ఇవ్వాళే చూశా నిన్ను బాగున్నావా
వెన్నెల గువ్వా...
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
వేచి ఉంది నవ్వుల నావ
నడపమందువా
కాచుకుంది పూవుల తోవ
చూపిస్తా నాతో రావా ॥
వేచి ఉంది నవ్వుల నావ
వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా
కాచుకుంది పూవుల తోవ
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
చరణం : 1
కళ్లు మూసుకోగానే
ఎన్ని కలలు వస్తాయో వాటి వెంట పోతూ రోజూ చూస్తానే నీ కోట
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
కళ్లు తెరుచుకోగానే
దారి మరిచిపోతానే
కోటి చుక్కలన్నిటి మధ్య
నీకోసం చూస్తుంటా
కరిగేటి కలవో నిజంగానే కలవో
అనుమానం తీర్చేయాలని
కళ్లారా కనిపించేవా॥॥ఉంది॥
చరణం : 2
ఊసుపోని ఊహల్లో
ఊయలూగు వేళల్లో
పాడుకుంటు ఉంటే నువ్వా
రాగాలే విన్నావా
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
చుక్కలూరి వీధుల్లో
ఒక్కదానివై ఉంటే
తోచుబాటు ఏమీ లేక
ఈ వైపు రాలేవా
నువు రాక మునుపే నీ రూపు తెలుసే
ఎలాగంటే నాకేం తెలుసు
నా మనస్సుకి కబురంపేవా॥॥ఉంది॥
Download the Song:
innALlU E mabbullO - ఇన్నాళ్లూ ఏ మబ్బుల్లో

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |