చిత్రం : మల్లీశ్వరి(mallISwavari) (1951)
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి(dEvulapalli krishnaSAstri)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు(sAlUri rAjEswararao)
గానం : భానుమతి(bhAnumati)
పల్లవి :
కోతిబావకు పెళ్లంట
కోవెల తోట విడిదంట (2)॥
చరణం : 1
మల్లీ మాలతి వస్తారా
మాలికలల్లి తెస్తారా
బంతి జాజి చేమంతి
బంతులుకట్టి తెస్తారా (2)
పెళ్లికి మీరు వస్తారా
పేరంటానికి వస్తారా
పందిరి వేస్తాము
ముందర ముగ్గులు పెడతాము
పందిరి కింద
పెళ్లివారికి విందులు చేస్తాము
మంచి విందులు చేస్తాము
బాకా బాజా డోలు సన్నాయ్ (3)
మేళాలెడతారు...
తప్పెటతాళాలెడతారు (2)॥
చరణం : 2
అందాల మా బావగారికి
గంధాలు పూసి... ఓ...
గారాల మా బావ మెడలో
హారాలు వేసి
కుళ్లాయెడతాము
కుచ్చుల తురాయి పెడతాము
హారాలేసి గంధం పూసి
కుళ్లాయెట్టి తురాయి పెడతాము
కుచ్చుల తురాయి పెడతాము
ఓ... పల్లకి ఎక్కి
పల్లకి ఎక్కి కోతి బావ పళ్లికిలిస్తాడు
బావ పళ్లికిలిస్తాడు
మా కోతి బావ పళ్లికిలిస్తాడు॥