Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

nallanivannI nILlani - నల్లనివన్నీ నీళ్లని

చిత్రం : ఛత్రపతి(chhatrapati) (2005)
రచన : వేటూరి(vETUri)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(M.M.kIravANi)
గానం : కె.ఎస్.చిత్ర(K.S.chitra)





పల్లవి :
నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని
అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా
జరిగిన కథ విని ఏ కడలి నవ్వింది
మమతకే తగనని
తొలిసారి తెలిసింది॥
చరణం : 1
వేయి కన్నుల కావేరిని
కడుపులోన దాచుకున్నా
అంతులేని కడలి లోతును
నేను చూస్తున్నా
కడుపులో నిన్ను మోయకున్నా
అమ్మ తప్పును కడుపులోన
దాచుకున్నా నిన్ను చూస్తున్నా
జరగనే జరగదు ఇకపైన పొరబాటు
నమ్మరా అమ్మని నా మీద నీ ఒట్టు॥
చరణం : 2
తప్పటడుగులు వేసినా
త ల్లిని విసిరేసిన
ఈ దారి తప్పిన తల్లిని వదిలెయ్యకు
చచ్చిపుడుతా నాయనా
బిడ్డగా నీ కడుపున
జరగనే జరగదు ఇకపైన పొరబాటు
నమ్మరా అమ్మని నా మీద నీ ఒట్టు ॥


Special Note:
వంశీ దర్శకత్వం వహించిన ‘సితార’ (1983) సినిమాతో తెరంగ్రేటం చేసిన భానుప్రియ అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్నన పొందారు. హీరోయిన్‌గా సక్సెస్ అయిన తర్వాత సహాయనటిగా కూడా తానేంటో నిరూపించుకున్నారు. 2005లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాలో ప్రభాస్ అమ్మగా కనిపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ సహాయనటిగా నంది అవార్డును అందుకున్నారు.
Download:
nallanivannI nILlani - నల్లనివన్నీ నీళ్లని
nallanivannI nILlani - నల్లనివన్నీ నీళ్లని

Comments