Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : ఎం.ఎల్.ఎ.(M.L.A) (1957)
రచన : ఆరుద్ర(Arudra)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు(penDyAla nAgEswararAo)
గానం : పి.సుశీల, మాధవపెద్ది సత్యం, బృందం(P.suseela,madhavapeddi satyam,troop)
30 January - నేడు గాంధీజీ వర్ధంతి


పల్లవి :
నమో నమో బాపూ...
మాకు న్యాయమార్గమే చూపు (2)॥నమో॥
చరణం : 1
నిరంతరం మా హృదంతరంలో
నిండి వెలుగుజ్యోతి
నిత్యసత్యకాంతి॥నమో॥
చరణం : 2
ధర్మదేవత నాల్గుపాదములు
బ్రహ్మదేవుని నాల్గువేదములు
ధర్మభూమిలో మరల నిలిపి... ఆ...
నిర్మల బోధలు చేసిన బాపూ॥నమో॥
చరణం : 3
నీవు తీసిన బాటలు దాటి
నీతిని విడచి నిన్నే మరచి (2)
నీ అనుచరులే మారెదరేమో...
ఓ... ఓ... ఓ...
నీ అనుచరులే మారెదరేమో
నిదురనుండి లేపూ... బాపూ...॥నమో॥
చరణం : 4
ఆశయాలకై అశువుల బాసిన
అమరమూర్తివయ్యా
నీవు ఆత్మబలముతో ఆదర్శాలు
అవనిలోన నిలుపు బాపూ...॥నమో॥
బాపూ....

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |