చిత్రం : ప్రళయం(praLayam) (1986)
రచన : అదృష్టదీపక్ (adrusTadeepak)
సంగీతం : కె.వి.మహదేవన్(K.V.mahadevan)
గానం : కె.జె.ఏసుదాస్, కె.ఎస్.చిత్ర(K.J.aesudAs, K.S.chitra)
పల్లవి : సరిగమ స్వరమేళనం జీవితం
నవరస సురఖేలనం శాశ్వతం॥
విరిసిన ప్రకృతి దరహాసంలో
సిరిసిరి వెన్నెల మధుమాసంలో॥
సా సారిసని ససరి సరి సని (2)
గసగా గసగా గసగా గసగా
చరణం : 1 కొత్త కోరికలు నిండిన
కొండగాలి తిరిగింది (2)
కొసరి కొసరి కొమ్మమీద
కోయిలమ్మ కూసింది ॥
మధురమైన భావానికి
పల్లవి దొరికింది (2)
అందమైన పాటకు
అభినందన తెలిపింది॥॥
సారి ససగరి ససమగా సారి
నీసా నినిరినిరిని నిగరీ నీసా
చరణం : 2 ఇన్ని వసంతాలు గడిచి
ఏ తీరం చేరాయో
వన్నెలన్ని నడచి నడచి
ఏ దూరం సాగాయో ॥
ఇంద్రధనువు రథం మీద
వెళ్లి తెచ్చుకుందాము
గరిగరినిద రినిరినిదమ నిదనిదమగ
మాదానీరీ ॥
చంద్రకాంతి పందిరిలో
ప్రేమ పంచుకుందాము॥॥
Special Note:
అదృష్టదీపక్ రావులపాలెంలో 1950లో జన్మించారు. గత నలబై ఏళ్లుగా రామచంద్రా పురంలో నివసిస్తున్నారు. 1980లో వచ్చిన ‘యువతరం కదిలింది’ అనే చిత్రంలో ‘ఆశయాల పందిరిలో... అనురాగం సందడిలో...’ అనే పాట ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆయన రాసిన నలబై పాటలు సందేశాత్మకమైనవి. అవి ఎంతో ప్రజాధరణ పొందాయి. పై పాట ప్రముఖ గాయని చిత్రకు తెలుగులో మొదటిది కావడం విశే షం.