చిత్రం : తులసి(tulasi) (1974)
రచన : ఆరుద్ర(Arudra)
సంగీతం : ఘంటసాల(ghanTasAla)
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల(S.P.bAlu,P.suseela)
20 January - నేడు కృష్ణంరాజు బర్త్‌డే
పల్లవి :
లలలలాలలాల ఆహా... (2)
అహహహా... హా...
అహహహా... హా
సెలయేటి గలగలా
చిరుగాలి కిలకిలా (2)
సిగ్గుపడే బుగ్గలతో
చెలి నవ్వులే మిలమిల
చిలిపి చిలిపి చూపులతో
నీ ఊహలే తళతళ
చరణం : 1
చందమామ కన్నా నీ చెలిమి చల్లన
సన్నజాజి కన్నా నీ మనసు తెల్లన
నిన్ను కౌగిలించ గుండె ఝల్లన
ఆ... నిన్ను కౌగిలించ గుండె ఝల్లన
నిలువెల్ల పులకించె మెల్లమెల్లన॥
చరణం : 2
పసినిమ్మ పండుకన్న నీవు పచ్చన
ఫలియించిన మన వలపే
వెచ్చవెచ్చన
అనురాగం ఏదేదో అమరభావన అనురాగం ఏదేదో అమరభావన
అది నీవు దయచేసిన గొప్ప దీవెన॥
Special Note:
కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి చిన వెంకట కృష్ణంరాజు. స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు. జనవరి 20, 1940లో జన్మించిన కృష్ణంరాజు దాదాపు 188 సినిమాలలో నటించారు. కె.ప్రత్యగాత్మ దర్శకత్వంలో 1966లో వచ్చిన ‘చిలకా గోరింక’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఇప్పటి వరకూ ఆయన ఐదు ఫిలిం ఫేర్ అవార్డులు, ఫిలిం ఫేర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు, ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రెండు సార్లు నంది అవార్డులు అందుకున్నారు.