చిత్రం : యమలీల(yamaleela) (1994)
రచన : సిరివెన్నెల(sirivennela)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి(S.V.KrishnAreddy)
గానం : కె.ఎస్. చిత్ర(K.S.chitra), ఎస్.పి.బాలు(S.P.BAlu)
పల్లవి :
సిరులొలికించే
చిన్ని నవ్వులే
మణిమాణిక్యాలు
చీకటి ఎరగని
బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే
తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దు మాటలే
మా ధనధాన్యాలు
ఎదగాలీ ఇంతకు ఇంతై
ఈ పసికూనా
ఏలాలీ ఈ జగమంతా ఎప్పటికైనా
మహారాజులా జీవించాలి
నిండునూరేళ్లూ ॥
జాబిల్లి జాబిల్లి జాబిల్లి
మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి
చరణం : 1
నాలో మురిపెమంతా
పాల బువ్వై పంచనీ
లోలో ఆశలన్నీ
నిజమయేలా పెంచనీ
మదిలో మచ్చలేని
చందమామే నువ్వనీ
ఊరూవాడ నిన్నే
మెచ్చుకుంటే చూడనీ
కలకాలమూ కనుపాపల్లే కాసుకోనీ
నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ॥
చరణం : 2
వేశా మొదటి అడుగు
అమ్మ వేలే ఊతగా
నేర్చా మొదటి పలుకు
అమ్మ పేరే ఆదిగా
నాలో అణువు అణువు
ఆలయంగా మారగా
నిత్యం కొలుచుకోనా
అమ్మ ఋణమే తీరగా
తోడుండగా నను దీవించే కన్నప్రేమ
కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా॥
Special Note:
ఎస్.వి.కృష్ణారెడ్డి 1991లో వచ్చిన ‘కొబ్బరిబొండాం’ చిత్రం ద్వారా సంగీత దర్శకత్వంలో అడుగుపెట్టారు. 1994లో వచ్చిన ‘యమలీల’ చిత్రానికి స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, సంగీతం కూడా అందించారు. 1994లో యమలీల చిత్రానికి గాను బెస్ట్ డెరైక్టర్‌గా, బెస్ట్ మ్యూజిక్ డెరైక్టర్‌గా రెండు ఫిలింఫేర్ అవార్డులు వరించాయి.