పల్లవి :
చిత్రం : సీతామాలక్ష్మి(sItAmAlakshmi) (1978)
రచన : వేటూరి(vEtUri)
సంగీతం : కె.వి.మహదేవన్(K.V.MahadEvan)
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల(S.P.bAlu,P.suSIla)
సీతాలు సింగారం
మాలచ్చి బంగారం
సీతామాలచ్చిమంటే
శ్రీలచ్చిమవతారం॥
మనసున్న మందారం
మనిషంతా బంగారం
బంగారు కొండయ్యంటే
భగవంతుడవతారం॥॥
చరణం : 1
పూసంత నవ్విందంటే
పున్నమి కావాలా
అయితే నవ్వనులే...
కాసంత చూసిందంటే
కడలే పొంగాలా
ఇక చూడలేను...
పూసంత నవ్విందంటే
పున్నమి కావాలా
కాసంత చూసిందంటే
కడలే పొంగాలా
ఎండి తెరమీద పుత్తడిబొమ్మ
ఎలగాలా ఎదగాలా
ఆ ఎదుగూ ఒదుగూ యెలుగూ
కన్నుల యెన్నెల కాయాలా
నువ్వంటుంటే
నే వింటుంటే
నూరేళ్లు నిండాలా ॥
చరణం : 2
దాగుడుమూతలు
ఆడావంటే దగ్గరకే రాను
అయితే నేనే వస్తాలే...
చక్కలిగింతలు పెట్టావంటే
చుక్కయిపోతాను
ఎగిరొస్తాలే...
దాగుడుమూతలు ఆడావంటే
దగ్గరకే రాను
చక్కలిగింతలు పెట్టావంటే
చుక్కయిపోతాను
గుండె గుడిలోన దివ్వెవు నువ్వై
వెలిగి వెలిగించాలా
నీ వెలుగుకు నీడై బ్రతుకున తోడై
ఉండిపోవాలా
నువ్వంటుంటే
నే వింటుంటే వెయ్యేళ్లు బతకాలా॥
Special Note:
Award winning nostalgic telugu song from the movie Seethamahalakshmi (1978) starring Chandramohan and Talluri Rameshwari.
Direction: K Viswanath
Music: KV Mahadevan
Lyric: Jaladi Raja Rao
Singers: SP Balasubramaniam and P Susheela
This song fetched the best lyric award for the writer Jaladi.
He is from Gudivada Krishna district.