Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : అన్నమయ్య(annamayya) (1997)
రచన : వేటూరి(vETUri)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(M.M.keeravANi)
గానం : బాలు, సుజాత, రేణుక(bAlu,sujAta,rENuka)
29 January - నేడు వేటూరి సుందరరామమూర్తి జయంతి




పల్లవి :
తెలుగుపదానికి జన్మదినం
ఇది జానపదానికి జ్ఞానపథం
ఏడుస్వరాలే ఏడుకొండలై
వెలసిన కలియుగ విష్ణుపదం
అన్నమయ్య జననం...
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం...
చరణం : 1
అరిషడ్వర్గము తెగనరికే
హరిఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి
నాదాశీస్సులు పొందినదై
శివలోకమున చిద్విలాసమున
ఢమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో
నవ్యలాస్యముల
పూబంతుల చేబంతిగ ఎగసి
నీరదమండల నారదతుంబుర
మహతీగానపు మహిమలు తెలిసి
సితహిమకంథర యతిరాట్‌సభలో
తపఃఫలమ్ముగ తళుకుమని
తల్లి తనముకై తల్లడిల్లు
ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో
ప్రవేశించె ఆ నందకము
నందనానందకారకము॥జననం॥
చరణం : 2
పద్మావతియే పురుడుపోయగా
పద్మాసనుడే ఉసురు పోయగా
విష్ణుతేజమై నాదబీజమై
ఆంధ్రసాహితీ అమరకోశమై
అవతరించెను అన్నమయ
అసతోమా సద్గమయ (2)
చరణం : 3
పాపడుగా నట్టింట పాకుతూ
భాగవతము చేపట్టెనయా
హరినామమ్మును ఆలకించక
అరముద్దలనే ముట్టడయా
తెలుగుభారతికి వెలుగు హారతై
ఎదలయలో
పదకవితలు వెలయ
తాళ్లపాకలో ఎదిగె అన్నమయ
తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ... (2)


Special Note:
పూర్తిపేరు : వేటూరి సుందరరామమూర్తి
జననం : 29-01-1936
జన్మస్థలం : కృష్ణాజిల్లా దివితాలుకాలోని పెదకళ్లేపల్లి గ్రామం
తల్లిదండ్రులు : వేటూరి చంద్రశేఖరశాస్త్రి-కమలాంబ
తోబుట్టువులు : తమ్ముడు సదానందమూర్తి
విద్యార్హత : బి.ఎ.
వివాహం-భార్య:7-5-1960, సీతామహాలక్ష్మి
సంతానం : ముగ్గురు పిల్లలు (రవిప్రకాష్, చంద్రశేఖర్, నందకిషోర్ )
రచయితగా తొలిచిత్రం-పాట-పారితోషకం : ఓ సీతకథ (1974) - భారతనారీ చరితము - మూడు వందల రూపాయలు
ఇప్పటివరకు రికార్డింగ్ జరిగిన ఆఖరి పాట : ఓంకారేశ్వరి... (చిత్రం : బద్రీనాథ్-2011)
రాసిన మొత్తం పాటలు-చిత్రాలు : ఐదు వేలకు పైగా పాటలు రాశారు. దాదాపు రెండు వేల చిత్రాలకు.
గౌరవ-పురస్కారాలు : నంది, కళాసాగర,మనస్విని, సితార, మరెన్నో సినీ అవార్డులు, ‘మాతృదేవోభవ’ చిత్రానికి జాతీయ అవార్డు, నాగార్జున యూనివర్సిటీ నుండి డాక్టరేట్ గౌరవం అందుకున్నారు.
మరణం : 22-05-2010

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |