చిత్రం : ఒకే కుటుంబం (okE kuTumbam) (1970)
రచన : దాశరథి (dASarathi)
సంగీతం : ఎస్.పి.కోదండపాణి (S.P.kOdaNdapANi)
గానం : ఘంటసాల, బృందం (ghantasAla, group)
పల్లవి : అందరికీ ఒక్కడే దేవుడు (2)
కొందరికి రహీము
కొందరికి రాముడు (2)
ఏ పేరున పిలిచినా
దేవుడు ఒక్కడే... దేవుడొక్కడే
॥ అందరికీ ॥
చరణం : 1
పూలలో ఉన్నాయి వేల రకాలు
పక్షులలో ఉన్నాయి లక్ష విధాలు
॥ అందరికీ ॥
రేకులు ఉంటేనే పువ్వంటాము
రెక్కలు ఉంటేనే పక్షంటాము
మతాలు వేరైనా కులాలు వేరైనా
మంచి మనసు ఉంటేనే
మనిషంటాము
మనుషులమై మనమంతా
కలిసుంటాము ॥ అందరికీ ॥
చరణం : 2
పై వేషం చూసి నీవు భ్రమపడరాదు
మేడిపండు మెరుగంతా
మేలిమి కాదు ॥వేషం॥
ఎక్కడో దేవునికై ఎందుకు వెదికేవు
పక్కనున్న మానవుని
ఎందుకు మరిచేవు
మానవసేవే మాధవసేవ
బాధపడే సోదరులను ఆదుకునేము
॥ మనుషులమై ॥ ॥ ॥ అందరికీ ॥
చరణం : 3
కష్టపడే నీతిపరుని కడుపు నిండదు
దోచుకునే దొరగారికి తృప్తి ఉండదు॥ కష్టపడే ॥
స్వార్థపరుల ఆట మనం కట్టిస్తాము
శ్రమజీవుల కష్టఫలం ఇప్పిస్తాము॥ స్వార్థపరుల ॥
అహింస బోధిస్తాం
ప్రశాంతి సాధిస్తాం
లోకంలో ఆకలే లేకుండా చేస్తాము
॥ మనుషులమై ॥ ॥ ॥ అందరికీ ॥