Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : పిడుగు రాముడు (piDugu rAmuDu) (1966)
రచన : డా॥సి.నారాయణరెడ్డి (Dr C.nArAyaNareddy)
సంగీతం : టి.వి.రాజు (T.V.S.rAju)
గానం : ఘంటసాల, పి.సుశీల(ghanTasAla,P.suseela)

20 February - నేడు టి.వి.రాజు వర్ధంతి


పల్లవి :
ఓహోహో... ఓహో... హో (2)
ఈ రేయి నీవు నేను
ఎలాగైన కలవాలి
నింగిలోని తారలు రెండు
నేలపైన నిలవాలి॥రేయి॥
చరణం : 1
ఏ మబ్బు మాటున్నావో
ఏ పొదల చాటున్నావో॥మబ్బు॥
ఏ గాలి తరగలపైన
ఊగి ఊగిపోతున్నావో (2)
కలగా వన్నే కవ్వించేవో॥రేయి॥
చరణం : 2
చందమామలో ఉన్నాను
చల్లగాలిలో ఉన్నాను॥
నీ కంటిపాపలలోన
నేను దాగి వున్నాను (2)
నీలో నేనై... నిలిచున్నాను...॥రేయి॥
చరణం : 3
ఆనాటి చూపులన్నీ
లోన దాచుకున్నాను (2)
నీవు లేని వెన్నెలలోన
నిలువజాలకున్నాను (2)
కనవే చెలియా... కనిపించేను...॥రేయి॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |