hE SayamAnmannadilE - హే... శతమానమన్నదిలే
చిత్రం : మృగరాజు (mrugarAju) (2001)రచన : వేటూరి (vETUri)
సంగీతం : మణిశర్మ (maNiSarma)
గానం : హరిహరన్, సాధనా సర్గమ్ (hariharan,sAdhanA sargam)
పల్లవి :
హే... శతమానమన్నదిలే
చెలిమే
చిన్ని చిన్నారి ఆశలు గిల్లే
వంక జాబిల్లి
వలపులు జల్లే
కొత్త వయ్యారమొచ్చింది
ఉయ్యాల
వయసులలో హలా
హే... శతమానమన్నదిలే చెలిమే
పువ్వు పాడేది పుప్పొడి జోల
తేటి కోరేది తేనెల లాల
నీలిమేఘాలలో తేలిపోవాలి
తనువులిలా ॥॥
చరణం : 1
విన్నానులే నీ ఎదలోతుల్లో
జలపాతాల సంగీతమే
కన్నానులే నీ కన్నుల్లోన
కలలేకన్నా సావాసమే
కోకిలలా కిలకిలలే మన పూదోటలో
తేనెలలా వెన్నెలలే
వేసవి పూటలో
ప్రాయమో గాయమో
సుమశర స్వరజతిలోన॥॥
చరణం : 2
చూడాలని చలికాటే పడని
చోటే గిచ్చే చూడాలని
చెప్పాలని నీ చూపే సోకని
సోకే అప్పజెప్పాలని
మరి పదవే విరిపొదకే
చెలి మర్యాదగా
ఎద కడిగే ఎదురడిగే
సిరి దోచెయ్యగా
వీణవో జాణవో
రతిముఖ సుఖ శ్రుతిలోన॥॥
మణిశర్మ పూర్తిపేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. 1964 జులై 11న కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జన్మించారు. తండ్రి వై.యన్.శర్మ వయొలిన్ కళాకారుడు. మణిశర్మ ప్రముఖ సంగీత దర్శకుడు ‘సత్యం’ దగ్గర కీ-బోర్డ్ ప్లేయర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అయితే సాలూరి రాజేశ్వరరావు దగ్గర నుండి తనకు జూనియర్ అయిన దేవిశ్రీ ప్రసాద్ వరకు కీ-బోర్డ్ వాయించిన ఘనత ఈతరంలో మణిశర్మకే ఉంది.