Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

nAkoka girlfriend (boys) - నాకొక గర్ల్‌ఫ్రెండ్(బాయ్స్)

చిత్రం : బాయ్స్(boys) (2003)
రచన : ఎ.ఎం.రత్నం, శివగణేశ్(A.M.ratnam,SivagaNeS)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్(A.R.rehamAn)
గానం : కార్తీక్, డిమ్మి, టిపు(kArthik,dimmi,Tipu)


పల్లవి : నేడే... నేడే... నేడే...
నేడే కావాలి... నేడే... కావాలి...
పదహారు ప్రాయంలో...
నాకొక గర్ల్‌ఫ్రెండ్ కావాలి
నేటి సరికొత్త జాజిపువ్వల్లె
నాకొక గర్ల్‌ఫ్రెండ్ కావాలి
వెబ్‌సైట్‌కెళ్లి లవ్ ఫైల్ తెరచి
ఇ-మెయిల్ హసుకే కొట్టాలి
చెమట పడితే... వానలో తడిస్తే...
ముఖము ముఖముతో తుడవాలి
నాకొక గర్లఫ్రెండ్ కావాలెరా... (2)

గర్ల్‌ఫ్రెండ్స్ అంటే బాయ్స్‌కి బూస్టే కదా!
గర్ల్‌ఫ్రెండ్స్ లేని లైఫే వేస్టే కదా!
గర్ల్‌ఫ్రెండ్స్ కావలె...॥
చరణం : 1 ఫ్రెండ్స్ యొక్క కవితను తెచ్చి
నా యొక్క కవిత అని చెప్పి
హృదయంలో చోటే పట్టంగా
ఫ్లాపైన సినిమాకు వెళ్లి
కార్నర్‌లో సీటు ఒకటి పట్టి
బబుల్ గమ్ము చిరుపెదవులు మార్చంగా
సెల్‌ఫోన్ బిల్ పెరగ జోకులతో చెవి కొరక
ఎస్.ఎమ్.ఎస్. పంపా...
కావలె గర్ల్‌ఫ్రెండ్ లే...
చరణం : 2
నాతోటి నడిచేటి నాకొక గర్ల్‌ఫ్రెండ్ కావాలి
కాలం మరిచేటి కబురులాడేటి
నాకొక గర్ల్‌ఫ్రెండ్ కావాలి
చంద్రుని చెణుకై గదిలో చినుకై
సంపంగి మొలకై ఉండాలి
ఇంకొక నీడై ఇంకొక ప్రాణమై
ఇరవై వేళ్లయి ఉండాలి
నాకొక గర్లఫ్రెండ్ కావాలెరా... (2)॥అంటే॥
చరణం : 3 బెకైక్కి ఊరంత తిరగ
ఆ... అంటే ట్రీట్ ఇచ్చు కొనగ
ఊ... అంటే గ్రీటింగ్ కార్డ్ ఇవ్వంగ
హాచ్ అంటే కర్చీఫ్ ఇచ్చి
ఉమ్ అంటే కుడిబుగ్గ చూపి
టక్ అంటూ తలమీద కొట్టంగ
చూస్తే బల్బ్ వెలగ బార్బీడోల్ వంటి
పానీటైల్ తోటి... కావలె గర్ల్‌ఫ్రెండ్ లే...
॥అంటే॥
నాకొక గర్లఫ్రెండ్ కావాలెరా... (2)



Special Note:
పై ఫొటోలో మధ్యలో ఉన్న వ్యక్తి థమన్. ‘బాయ్స్’ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యారు. నటుడిగా చాలా అవకాశాలు వచ్చినా వాటిని వదులుకున్నారు. శంకర్ నిర్మించిన ‘ఈరమ్ (2009)’ అనే హారర్ మూవీకి సంగీత బాధ్యతలు అప్పగించారు. అదే సినిమా ‘వైశాలి (2011)’గా తెలుగులోకి వచ్చింది. థమన్ పూర్తిపేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ థమన్ శివకుమార్. చెన్నైలో ఒక సంగీత కుటుంబంలో థమన్ జన్మించారు. తండ్రి ఘంటసాల శివకుమార్ ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి దగ్గర సుమారు 700 సినిమాలకు డ్రమ్మర్‌గా పనిచేశారు.
థమన్ అమ్మగారు సావిత్రి కూడా గాయకురాలు కావడంతో థమన్‌కు చిన్నతనం నుండే సంగీత వాతావరణంలో పెరిగారు. చిన్న వయసులోనే డ్రమ్స్‌ను వేగంగా వాయించేవారు. దక్షిణ భారతదేశంలో దాదాపు అందరు సంగీత దర్శకుల దగ్గర పనిచేశారు థమన్. అయితే ఒక్క మణిశర్మ దగ్గర మాత్రం దాదాపు ఏడేళ్లు పనిచేశారు. ‘కిక్ (2009)’ చిత్రంతో సంగీత దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమై తన బాణీలతో కిక్కిచ్చే మ్యూజిక్ డెరైక్టర్‌గా పేరు సంపాదించారు. ఇటీవల రిలీజైన దూకుడు, బాడీగార్డ్, బిజినెస్‌మేన్, లవ్ ఫెయిల్యూర్ వంటి చిత్రాలకు థమన్ హిట్ పాటలు ఇచ్చారు.

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |