రచన : సముద్రాల సీనియర్ (samudrAla senior)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు (sAlUri rAjEswararao)
గానం : ఘంటసాల (ghanTasAla)
11 February - నేడు ఘంటసాల వర్ధంతి
పల్లవి :
ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
నీ మధుమురళీ గానలీల (2)
మనసును చివురిడురా కృష్ణా...
॥మధుమురళీ॥
చరణం :
యమునా తటమున
మోడులు మురిసి
యమునా తటమున
మోడులు మురిసి
పువులు పూచినవి గోపాలా...
మధుమురళీ॥
నీ మధుమురళీ గానలీల...
మప ససససససససస
నిరిసస నిరిసస నిససస నిరిరిరి
నిససస నిరిరిరి నిసస నిరిరి
నిసస నిరిరి
నిసదప మపనిస రిసదప
మపసనిదప మదపప
గమరిసనిస... ఆ...
Special Note:
సంగీతాన్ని అభ్యసించడానికి ఘంటసాల విజయనగరం వెళ్లారు. అప్పట్లో ఆంధ్రదేశం మొత్తానికి ఉన్న ఏకైక సంగీతకళాశాల విజయనగరంలో మాత్రమే ఉంది.
అందులో చేరి వయొలిన్ నేర్చుకుందామని వెళ్లిన ఘంటసాలకు, కళాశాల ప్రిన్సిపాల్ ద్వారం వెంకటస్వామినాయుడుగారు కొన్ని సంగతులు పాడమని పరీక్ష పెట్టారు. ఘంటసాల పాట విన్న నాయుడుగారు, ‘‘నీ గాత్రం బాగుంది. గాత్ర సంగీతంలోనే సాధన చెయ్యి’’ అన్నారు. అంత పెద్దాయన చెప్పాక ఇక తిరుగేముంటుంది! తెలుగువారు గర్వించేంత ఎత్తుకు అనతికాలంలోనే ఎదిగారు ఘంటసాల.
Comments