చిత్రం : ఆత్మగౌరవం(Atmagauravam) (1966)
రచన : ఆరుద్ర (Arudra)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు (sAlUri rAjEswararao)
గానం : ఘంటసాల (ghanTasAla)
సాకీ :
ఓ... సోదరసోదరీమణులారా
ఆదరించి నా మాట వింటారా
వింటాం... చెప్పు
పల్లవి :
ప్రేమించి పెళ్లిచేసుకో
నీ మనసంతా హాయి నింపుకో
ప్రేమించి పెళ్లిచేసుకో...
చరణం : 1
వరుని వలపేమిటో
వధువు తలపేమిటో
తెలుసుకోలేక పెళ్లిళ్లు జరిపించినా॥
తెలిసి కట్నాలకై బతుకు బలిచేసినా
కడకు మిగిలేది ఎడమోము
పెడమోములే॥
చరణం : 2
మనిషి తెలియాలిలే
మనసు కలవాలిలే
మరచిపోలేని స్నేహాన కరగాలిలే॥
మధుర ప్రణయాలు
మనువుగా మారాలిలే
మారి నూరేళ్లపంటగా వెలగాలిలే॥
చరణం : 3
నలుడు ప్రేమించి పెళ్లాడె
దమయంతిని
వలచి రుక్మిణియే పిలిపించె
శ్రీకృష్ణుని॥
తొలుత మనసిచ్చి మనువాడె
దుష్యంతుడు
పాత ఒరవళ్లు దిద్దాలి మీరందరూ॥
Listen: